టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి టైం ముగిసిపోయిందా..? అంటే అవునని అంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. అంతేకాదు సినీ విశ్లేషకులు సైతం అదే భావిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్లు హీరోగా సినిమాలు చేసి రాణించిన మెగాస్టార్ చిరంజీవి .. ఇక హీరోలుగా సినిమాలు చేసే టైం దాటిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఆయన హీరోలుగా చేసిన ప్రతి సినిమా ఇప్పుడు డిజాస్టర్ గా మారుతూ ఉండడంతో .. ఇక ఆయన హీరోగా రిటైర్మెంట్ ఇచ్చి సీనియర్ పాత్రలు చేస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు .
అంతేకాదు ఆయన ఆరోగ్యంపరంగా కూడా కొంచెం బాగా లేనట్లు తెలుస్తుంది. రీసెంట్ గానే మోకాల సర్జరీ చేయించుకున్నారట . అందుకే ఏ ఈవెంట్లకి ఫంక్షన్లకి హాజరు కాలేను అంటూ చెప్పుకొస్తున్నారట . అంతేకాదు ఇక తన కొడుకులకి బాధ్యతలు అప్పగిస్తూ తన కొడుకే అన్ని ఫంక్షన్లకు ఈవెంట్లకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. మరీ ముఖ్యంగా సినిమాల్లో కూడా ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు తప్పిస్తే కొత్త సినిమాలు ఏవి కూడా కమిట్ అయ్యే ఆలోచనలు ఇక ఆయనకు లేవు అంటూ కూడా తెలుస్తుంది .
ఏదో అడపాదడపా సినిమాలో సీనియర్ రోల్స్ తప్పిస్తే పూర్తిగా రోల్ చేయలేను అంటూ కుటుంబ సభ్యులకే చెప్పేస్తున్నారట . దీంతో ఇండస్ట్రీలో మెగాస్టార్ టైం ముగిసిపోయింది . ఇప్పుడు మెగా పవర్ స్టార్ టైం వచ్చేసింది అంటూ అభిమానులు జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!