దక్షిణ భారతదేశ సినిమా పరిశ్రమలో చాలామంది నటీనటులు అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత ఉద్యోగం చేయవలసిన వాళ్లు కూడా అనూహ్యంగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలు, హీరోయిన్లు అయ్యారు.
సాయిపల్లవి :
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిధా చేసింది అందాల భామ సాయి పల్లవి. ఆమె సహజమైన నటనా శైలికి అనేక రకాల భావోద్వేగాలను చిత్రీకరించే రేంజ్ కు ఆమె ఎదిగిపోయింది. సాయి పల్లవి జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పట్టా పొందారు. వైద్య విద్య పూర్తికాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్స్ ఈమెను ప్రేమమ్ సినిమాలో నటించమని అడగడంతో అలా ఆమె సినిమాల్లోకి వచ్చి తిరిగి లేని హీరోయిన్గా దూసుకుపోతోంది.
ప్రభాస్:
సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా రేంజ్ దాటి హాలీవుడ్ వైపు దూసుకుపోతున్నాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి, సాహో ఇప్పుడు సలార్ – కల్కి సినిమాలతో ప్రభాస్ రేంజ్ మామూలుగా లేదు. ప్రభాస్ తన ప్రాథమిక విద్య భీమవరం డిఎన్ఆర్ స్కూల్లో పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాదులోని చైతన్య కాలేజీలో బిటెక్ కంప్లీట్ చేశాడు. ప్రభాస్ కు చదువుకుంటున్న సమయంలో గోపీచంద్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – రాణా దగ్గుబాటి మంచి సన్నిహితులు.
రకుల్‌ప్రీత్‌సింగ్:
మనలో చాలామందికి లెక్కలు అంటే ఎప్పుడు భయం ఉంటుంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసింది. ఇంటర్ అయ్యాక పాకెట్ మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది. అలాగే ఆమె జాతీయ ఇస్తాయి గోల్ఫ్ క్రీడాకారిణి కూడా..! కరాటే లో బ్లూ బెల్ట్ కూడా ఆమె సాధించింది.
రష్మిక :
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ ఇండియాలో పుష్ప సినిమాతో బాగా పాపులర్ అయిపోయింది. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించి ఆ తర్వాత బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య కాలేజ్ ఆఫ్ సైన్స్ కాలేజ్ నుంచి సైకాలజీ – జర్నలిజం – ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. అలా ఆమె ట్రిపుల్ గ్రాడ్యుయేట్ సాధించింది.
నాగార్జున:
భారతీయ సినిమా నటుడు, నిర్మాత నాగార్జున అక్కినేని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. తర్వాత మద్రాస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు.
కార్తీ:
తమిళ హీరో కార్తీ చెన్నైలోని క్రిసెంట్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. తర్వాత న్యూయార్క్ లోని బింగ్ హోం టన్ యూనివర్సిటీ నుంచి పారిశ్రామిక ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
విక్రమ్:
దక్షిణ భారతదేశ సినిమా పరిశ్రమలు విభిన్నమైన నటుడుగా చియన్ విక్రంకు మంచి గుర్తింపు ఉంది. విక్రమ్ ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది తర్వాత చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు
మాధవన్:
మాధవన్ బీహార్ లోని తమిళ కుటుంబంలో జన్మించారు. కొల్హాపూర్ లోని రాజారాం కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ముంబైలోని చల్లారం కాలేజీ నుంచి పబ్లిక్ స్పీకింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందారు. మాధవన్ మంచి వక్త కూడా..!