సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఇగోలు, పంతాలు మామూలుగా నడుస్తూ ఉంటాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి – అతిలోక అందాల సుందరి శ్రీదేవికి అప్పట్లో టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ తరం ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా గుర్తుండి పోతుంది అంటే ఈ సినిమా ఎంతలా ? ప్రభావం చూపిందో అర్థమవుతుంది.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత వచ్చిన ఎస్పీ పరశురాం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత శ్రీదేవి నిర్మాతగా చిరంజీవి హీరోగా వజ్రాల దొంగ అనే సినిమా ప్రారంభమైంది. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. శ్రీదేవి స్వయంగా నిర్మాత కావడం ఇటు చిరంజీవి హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఓపెనింగ్ కి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ముఖ్యఅతిథిగా వచ్చి క్లబ్ కొట్టారు.
కమలహాసన్ – రాధిక లాంటి స్టార్స్ కూడా ఈ సినిమా ఓపెనింగ్ కు వచ్చారు. రెండు పాటల షూటింగ్ కూడా అయింది. అయితే కథ విషయంలో తాను చెప్పినట్టు మార్పులు చేయాలని శ్రీదేవి దర్శకుడిపై ఒత్తిడి చేయడం ప్రారంభించారట. అంటే హీరో కన్నా.. హీరోయిన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని శ్రీదేవి పట్టుపెట్టారు. ఇది చిరంజీవికి నచ్చలేదు.
అలా ఇద్దరి మధ్య ఇగో పెరిగిపోవడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే అప్పటికే ఈ ప్రాజెక్టు మీద నిర్మాతగా శ్రీదేవి రెండు కోట్లు ఖర్చు పెట్టారు. ఆ రోజుల్లో రెండు కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం.. అలా చిరంజీవి – శ్రీదేవి ఈ ఒక్క సినిమా విషయంలోనే కాదు. చాలా సినిమాల విషయంలో పంతాలకు పోవడం వల్లే ఆమె సంపాదించింది అంతా చివర్లో స్వల్ప వ్యవధిలోనే కోల్పోవాల్సి వచ్చిందని కూడా అంటూ ఉంటారు.