సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు ప్రత్యేకంగా చెప్పలేరు . దానికి రీజన్స్ ఏవైనా కావచ్చు. అలాగే ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎంట్రీ ఇవ్వాలి అనేది మొత్తం వాళ్ళ తలరాత పైనే ఆధారపడి ఉంటుంది . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వికపూర్ తెలుగులో దేవర సినిమా కంటే ముందే మరొక సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సింది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .
ఆ సినిమా మరేదో కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ . అక్కినేని అఖిల్ ఖాతాలో పడిన ఏకైక హిట్ సినిమా ఇదే కారణం గమనార్హం. అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో మొదటగా జాన్వి కపూర్ ని అనుకున్నారట మేకర్స్.
కానీ బోనీకపూర్ అప్పటికే ఫుల్ ఫ్లాప్ ట్రాక్స్ లో ఉన్న అఖిల్ తో నటిస్తే జాన్వి కెరియర్ పాడైపోతుంది అన్న భయంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసాడట . ఆ తర్వాత ఈ రోల్ కి పూజ సెలెక్ట్ అయ్యింది. పూజ ద్వారా ఈ సినిమా హిట్టు కొట్టే అంత స్థాయికి ఎదిగిపోయింది . అయినా ఏం లాభం ఇప్పుడు పూజా చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . అలా ఆ సినిమాను వదులుకొని మంచి పని చేసింది జాన్వి అంటూ చెప్పుకు వస్తున్నారు శ్రీదేవి అభిమానులు..!!