Moviesఎన్టీఆర్-ఏఎన్ఆర్ ..ఇద్దరిలో ఎవరు గొప్ప..? అభిమానుల ఆన్సర్ ఇదే..!!

ఎన్టీఆర్-ఏఎన్ఆర్ ..ఇద్దరిలో ఎవరు గొప్ప..? అభిమానుల ఆన్సర్ ఇదే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివాళ్ళు ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ అని అంత అంటూ ఉంటారు. అది నిజమే .. వాళ్ళిద్దరూ లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీనే లేదు . తమ రెండు భుజాలపై సినిమా ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చారు . అప్పుడు వాళ్ళిద్దరూ కష్టపడకపోయి ఉంటే ఇప్పుడు ఒక్కొక్క హీరో 100 కోట్లు 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని ఉండే వారే కాదు ..ఆ విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇండస్ట్రీ ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లను ఎప్పుడు మనం గుర్తు పెట్టుకొని ఉండాలి.

అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ కోసం ఓవరాక్షన్ ఎక్కువగా చేస్తూ ..మా హీరో గొప్ప అంటే మా హీరో తోపు అంటూ తెగ కొట్టేసుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోని రీసెంట్గా ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహా ఆవిష్కరణ అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది . ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి సినీ ఫీల్డ్ కి ఏఎన్ఆర్ చేసిన గొప్ప సేవలు గురించి వివరించారు .

అయితే ఇలాంటి క్రమంలోనే కొందరు అక్కినేని ఫ్యాన్స్ ఎన్టీఆర్ కన్నా ఏఎన్నారే గొప్ప అని .. ఎన్టీఆర్ కి చాలా చాలా కోపమని .. సగంలో రాజకీయాల వైపు వెళ్లి ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీనీ వదిలేసారని ఆ టైంలో కూడా ఏఎన్ ఆర్ ఇండస్ట్రీలో గొప్పగా సినిమాలు చేసి ఆ స్థాయిలో నిలిచోపెట్టారని.. కామెంట్స్ చేస్తున్నారు . ఇదే క్రమంలో కొందరు నందమూరి ఫ్యాన్స్ ఆ కామెంట్స్ కి కౌంటర్స్ ఇస్తున్నారు . ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ సినిమా ఇండస్ట్రీలోనూ రెండిట్లోనూ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు కానీ ఏఎన్ఆర్ కి ఆ స్టామినా లేదు.. ఏఎన్ఆర్ ఆస్థానం దక్కించుకోలేకపోయాడు .. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎవరు గొప్ప అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే చాలామంది జనాలు మాత్రం ఇండస్ట్రీకి ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news