ప్రేక్షకులకు సినీ సెలబ్రిటీలు ఓ రోల్ మోడల్.. వారిలా స్టైల్ గా ఉండాలని వాళ్లనే అనుకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. అంతేకాదు వాళ్ళతో ఫోటోలు దిగాలని ఆ ఫోటోలను జీవితాంతం ఇంట్లో ప్రేమ్ కట్టించుకుని ఉండాలని ఎన్నో ఆశలతో ఉంటారు. ఒక్కొక్కసారి సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులను వేలానికి పెడుతూ ఉంటారు. వాటిని దక్కించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు అభిమానులు.
ఒకప్పుడు మత్తు కళ్ళతో సౌత్ సినిమాను ఒక ఊపు ఊపేసింది. సిల్క్ స్మిత అలియాస్ వడ్లపట్ల విజయలక్ష్మి.. సినిమా రంగంపై మోజుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సిల్క్ స్మితగా ఎదిగింది. సిల్క్ స్మితకు ఆ రోజుల్లోనే లక్షలాదిమంది అభిమానులు ఉండేవారు. ఒకసారి ఆమె సినిమా షూటింగ్లో యాపిల్ తింటోంది. వెంటనే డైరెక్టర్ షాట్ చెప్పడంతో సగం కొరికిన యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది.
అయితే సిల్క్ స్మిత మేనేజర్ ఆమె సగం కొరికిన యాపిల్ను వేలం వేశారట. ఆ వేలం పాట అప్పట్లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ సొంతం చేసుకునేందుకు రు. 200తో మొదలైన పాట రెండు వేలకు చేరుకుంది. ఆ తర్వాత 20,000.. చివరకు లక్ష రూపాయలకు చేరుకుంది. అంత మొత్తం పెట్టి ఓ అభిమాని దానిని సొంతం చేసుకున్నాడు.
దీనిని బట్టి సిల్క్ స్మిత క్రేజ్ అప్పట్లో ఎలా ఉందో అర్థం అవుతుంది. సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా ది డర్టీ పిక్చర్ అనే సినిమా కూడా వచ్చింది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఈ సినిమాలో కీరోల్ పోషించిన సంగతి తెలిసిందే.