టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా తన కొడుకు రామ్ చరణ్ విషయంలో అయితే కూసింత ఎక్కువగానే స్టిక్ట్ గా ఉంటాడు , ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చే హీరోలు ఎలా ఉండాలి..? ఏంటి అన్న విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన చరణ్ బాడీ ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని .. మరీ నటుడు శ్రీహరి వద్దకు ఫిట్నెస్ కోసం పంపించారు . అయితే రెండు రోజులు బాగానే వెళ్లిన రామ్ చరణ్ మూడో రోజు ఆయన పెట్టే కఠినమైన రూల్స్ ఫాలో అవ్వలేక ఏడుస్తూ ఇంటికి వచ్చేసారట.. అంతేకాదు ఆయన దగ్గర నేను జాయిన్ అయితే చచ్చిపోతాను అంటూ ఏడుస్తూ నేను వెళ్లను అంటూ మొండి చేశారట .
అంతేకారు.. చిరంజీవి ఎంత చెప్పినా సరే విననే వినలేదట.. శ్రీహరి ఫిట్నెస్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో మనకు తెలియనిది కాదు . ఆ కఠినమైన రూల్స్ భరిరించలేని చరణ్ .. నేను ఇక వెళ్ళను అంటూ తెగేసి చెప్పేశాడట . ఆ తర్వాత చిరంజీవి సైతం ఫిట్నెస్ కోసం తానే స్వయంగా ఇంటి వద్ద కేర్ తీసుకొని ఓ ఫిట్నెస్ కోచ్ ని అప్పాయింట్ చేసుకున్నారట..!!