Moviesకారు పై "మూత్రం" పోసిన తెలుగు హీరో..ఎందుకో తెలుసా..?

కారు పై “మూత్రం” పోసిన తెలుగు హీరో..ఎందుకో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఒకప్పటి విషయాలు మళ్లీ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి . ఇప్పటికే అలా మనం ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవ్వడం చూసాం . రీసెంట్గా సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. గతంలో రానా హోస్ట్ చేసిన ఓ షోకి అటెండ్ అయిన విజయ్ దేవరకొండ తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆక్వాడ్ సిచువేషన్ షేర్ చేసుకున్నాడు .

ఈ ప్రోగ్రాం లో రానా “నీ లైఫ్ లో ఇప్పటివరకు చేసిన క్రేజీ పని ఏదైనా ఉందా..? నువ్వు మర్చిపోలేనిది..? అంటూ అడుగుతాడు”. అప్పుడు విజయ్ దేవరకొండ దానికి బోల్డ్ గా ఆన్సర్ ఇస్తూ..” ఒకరోజు కారు పైకి ఎక్కి మూత్రం పోశాను.. ఆరోజు మా నాన్న నన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇవే కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.

మొదటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో అంటే డేరింగ్ కి మరో మారుపేరు అంటుంటారు జనాలు . ఈ ఆన్సర్ విన్నాక విజయ్ కి అది యాక్ట్ బిరుదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇది సరదాగా చేసిన కామెంట్స్ అయినా సరే.. నెట్టింట తెగ వైరల్ గా మారాయి. కొంతమంది విజయ్ దేవరకొండ కి పిచ్చా ..?అంటుంటే కాదు కాదు అది విజయ్ దేవరకొండ నాటినెస్ అంటున్నారు. పిచ్చో.. పైత్యమో.. విజయ్ దేవరకొండ చేసిన ఆ పనిని కూడా జనాలు లైక్ చేస్తూ ఉండడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news