నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా.. యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావి పూడి తెరకెక్కించిన ఈ లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా దసరా కానుకగా అక్టోబర్ 19 థియేటర్లలోకి దిగుతోంది. అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై గట్టి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం యావత్ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ సరికొత్త డెసిషన్ తీసుకోవడం విశేషం. బాలయ్య సినిమాలకు నెల రోజుల ముందు నుంచే బుల్లితెరపై ప్రమోషన్లు ప్రారంభించడం కొత్త విశేషం అని చెప్పాలి. ముందుగా బుల్లితెర ఆడియన్స్ టార్గెట్ చేసిన భగవంత్ కేసరి యూనిట్ జీ తెలుగు ఛానల్ లో ఓ ప్రోగ్రాం కి కూడా హాజరయ్యారు.
సినిమా రిలీజ్ కి ఇంకా నెల సమయం ఉండగానే అప్పుడే బుల్లితెరపై ప్రమోషన్లు ప్రారంభించడం ఈ సినిమాకు పెద్ద బూస్టప్ అని చెప్పాలి. దర్శకుడు అనిల్ రావిపూడి కి ఆల్రెడీ స్మాల్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. అటు బాలయ్యకు బుల్లితెరపై ఇటీవల కాలంలో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు.
అందుకే మంచి ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు ఈ సినిమా యూనిట్ మువ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం కి సంగీత దర్శకుడు తమన్ కూడా హాజరయ్యాడు. ఏది ఏమైనా భగవంత్ కేసరి సినిమాపై ఉన్న అంచనాలతో బాలయ్య కెరీర్ లోనే కని విని ఎరిగిన రేంజ్ లో ఓపెనింగ్స్ నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు.