Moviesఫ్యాన్స్ చిరకాల కోరిక తీర్చబోతున్న రాజమౌళి.. ఎన్టీఆర్ ని అలాంటి పాత్రలో...

ఫ్యాన్స్ చిరకాల కోరిక తీర్చబోతున్న రాజమౌళి.. ఎన్టీఆర్ ని అలాంటి పాత్రలో చూపించబోతున్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి పేర్లు చెప్తే ఇండస్ట్రీలో ఉండే జనాలకి ఎలా గూస్ బంప్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడంతో వీళ్ళ కాంబో పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి అదే ప్రూవ్ చేసుకున్న వీళ్ళు మరొకసారి ఇదే కాంబోని రిపీట్ చేయబోతున్నారు అంటూ తెలుస్తుంది.

రీసెంట్గా రాజమౌళి మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాకు సమర్పికుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు . భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ రూపొందుతున్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహించునున్నారు . ఈ క్రమంలోనే ఈ సినిమాలో దాదాసాహెబ్ పాల్కే పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత వార్ 2 ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుని ఉన్నారు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి కోసమే మేడ్ ఇన్ ఇండియా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నారట. అంతేకాదు ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోవట్లేదు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . చూద్దాం మరి ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడో తారక్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news