Moviesవార్నీ.. ఎన్టీఆర్ పై ఇంత పిచ్చి అభిమానామా..? ఫ్యాన్స్ ఏం చేసారో...

వార్నీ.. ఎన్టీఆర్ పై ఇంత పిచ్చి అభిమానామా..? ఫ్యాన్స్ ఏం చేసారో చూడండి..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది అభిమాన హీరోలను బాగా లైక్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క విధంగా తమకున్న అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు . అయితే అందరిలోకి నందమూరి అభిమానులు కూసింత డిఫరెంట్ అనే చెప్పాలి. తమ అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని ఈసారి ఎలా చాటిచెప్పారో మీరే చూడండి ..ఇది చదివి తెలుసుకోండి..!!

జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు ఇండస్ట్రీలో పడి చచ్చిపోయే జనాలు ఎంతో మంది ఉన్నారు . ముఖ్యంగా ఆయన నటన ..ఆయన మాటకారితనం .. ఆయన ఇతరుల పట్ల చూపించే ప్రేమ .. అందరికీ బాగా నచ్చుతుంది. కాగ రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమా లో నటించిన ఈయన ప్రజెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో వినాయక చవితి సందర్భంగా పలువురు నందమూరి అభిమానులు ఆయన సినిమాలో నటించిన కొన్ని అట్రాక్టివ్ ఫొటోస్ ద్వారా గణేష్ విగ్రహాలను క్రియేట్ చేశారు .

మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పులిని వేటాడే సీన్ కి సంబంధించిన గణేష్ విగ్రహం చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది . అంతేకాదు దేవర సినిమాలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆధారంగా కూడా గణేష్ ను డిజైన్ చేశారు . ఈ ఫొటోస్ చూడడానికి చాలా చాలా అద్భుతంగా చక్కగా అనిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంట్రా బాబోయ్ ఇంత అభిమానం చూపిస్తున్నారు అంటూ కామన్ పీపుల్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ అంటే తమకు ఎంత ఇష్టమో మరోసారి చాటి చెప్పారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news