టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియా కోడైకూస్తుంది . అయితే రీసెంట్గా ప్రముఖ మీడియా ఛానల్.. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు ప్రచురించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అంత పెద్ద మీడియా ఛానల్ వార్తలు రాయడంతో కాస్తో కూస్తో నిజం ఉండనే ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే నిజంగానే అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి మ్యాటర్ ఇంట్లో సీరియ్స్ డిస్కషన్స్ మధ్య నడుస్తుంది . కానీ నాగార్జున చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాగచైతన్యకు ఇష్టం లేదట . ఆయన శోభితా ధూళిపాళ్లని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడట.
అంతేకాదు అందుకే ఈ వార్త లో ఎటువంటి నిజం లేదు అంటూ పర్సనల్ టీం ద్వారానే స్పందించేశాడు నాగచైతన్య అంటూ కూడా తెలుస్తుంది. అంతేనా త్వరలోనే శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ విషయం అఫీషియల్ గా ప్రకటించబోతున్నాడట ఈ అక్కినేని హీరో . దీంతో అక్కినేని నాగచైతన్య – అక్కినేని నాగార్జున మధ్య కోల్డ్ వార్ షురూ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!