టాలీవుడ్ నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య ప్రజెంట్ .. ఎలాంటి టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నారో మనకు తెలిసిందే. నీతి న్యాయం నిజాయితీ అంటూ ఎప్పుడు ప్రజల క్షేమాలు కోరుకునే నందమూరి ఫ్యామిలీకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది . అందుకే కాబోలు చేయని తప్పుకు ఆయన బావ గారు చంద్రబాబు నాయుడు అరెస్టై జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు అంటున్నారు అభిమానులు .
కాగా తన బావ అరెస్టు కావడంతో చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడంతో బాలకృష్ణ ఇప్పుడు ఆయన పాత్రను రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన కమిట్ అయిన సినిమాలు షూటింగ్ కి అటెండ్ కాలేని పరిస్థితి నెలకొంది . భగవంత్ కేసరి సినిమా పరిస్థితి వేరు.. ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయింది ..కొంచెం శాతమే పెండింగ్లో ఉంది టెన్ డేస్ కాల్ షీట్స్ ఇచ్చిన అడ్జస్ట్ అయిపోయి అనిల్ రావిపూడి సినిమా షూట్ ను కంప్లీట్ చేస్తారు .
అయితే బాబి సినిమా అలా కాదు ఇప్పుడే సైన్ చేసింది. ఈ సినిమా పూర్తి అవ్వాలంటే ఆరు నెలల పైనే పడుతుంది. అంత టైం బాలయ్య ఇప్పుడు ఇవ్వలేడు . అందుకే ఈ సినిమాని వేరే హీరోతో చేస్తాను అని అంటే చేసుకో అంటూ ఓపెన్ గా చెప్పేసాడట . అయితే ఇప్పుడు నిజంగా బాబి అంత టైం వెయిట్ చేయలేకపోతే కచ్చితంగా ఈ స్టోరీ ను మెగా హీరోలతోనే చేస్తారు . ఎందుకంటే రీసెంట్ గానే వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాబి . ఆ చనువు నమ్మకం కచ్చితంగా మెగా ఫ్యామిలీతో ఉంటుంది . ఒకవేళ ఈ సినిమా బాలయ్య ఖాతాలో నుంచి మిస్ అయితే కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి ఖాతాలోనే పడుతుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి బాబీ ఏం చేస్తాడో..?