Moviesఎన్ని అవార్డ్స్ వచ్చినా..ఆ విషయంలో బన్నీ-తారక్ తరువాతే చరణ్.. ఇంతకంటే ప్రూఫ్...

ఎన్ని అవార్డ్స్ వచ్చినా..ఆ విషయంలో బన్నీ-తారక్ తరువాతే చరణ్.. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ని ఏ రేంజ్ లో అభిమానిస్తూ ఉంటారో ఫాన్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .మా హీరో కత్తి అంటే మా హీరో తురుము .. మా హీరో టాప్ అంటూ ఎవరి హీరోలను వాళ్ళ ఫ్యాన్స్ పొగిడేసుకుంటూ ఉంటారు. కాగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో అల్లు – మెగా వార్ ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . కాగ రీసెంట్గా సోషల్ మీడియాలో మరోసారి కొత్త విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు అని అడిగితే కచ్చితంగా చెప్పే పేర్లు ముగ్గురు ఎన్టీఆర్ – బన్నీ – చరణ్ .

ముగ్గురికి ముగ్గురు నటన విషయంలో ఏమాత్రం తీసిపోరు.. ముగ్గురు బడా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలే ..ముగ్గురు కూడా పాన్ ఇండియా వైడ్ సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఎక్కువ మంది డైరెక్టర్స్ మాత్రం అల్లు అర్జున్ తో – తారక్ తో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . హాలీవుడ్ డైరెక్టర్స్ అయితే ఏకంగా అఫీషియల్ గా కూడా ప్రకటించేశారు. తారక్ ఒప్పుకుంటే మేము సినిమా చేస్తామని కూడా చెప్పుతున్నారు. అల్లు అర్జున్ తో సినిమాలు తెరకెక్కించాలని కోలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

అయితే అదే రేంజ్ లో క్రేజ్ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్ మాత్రం లోకల్ డైరెక్టర్ లతో సినిమాను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సనాకు కమిట్ అయిన రామ్ చరణ్ ఆ తర్వాత లోకేష్ కనగరాజు తో సినిమా తీస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇది ఇంకా మాటల మధ్యలోనే ఉంది కానీ ఫైనలైజ్ అవ్వలేదు. మరోపక్క ఇతగాడితో కంపేర్ చేస్తే చరణ్ కి పోటీగా ఉన్న హీరోస్ మాత్రం బడాబడా డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే బన్నీ – తారక్ తో కంపేర్ చేస్తే చరణ్ కొంచెం వెనుకబడినట్లే అంటూ జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news