Moviesఅద్ది రా బాలయ్యా అంటే..బావ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా ఏం...

అద్ది రా బాలయ్యా అంటే..బావ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా ఏం చేసాడో తెలుసా..?

గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో.. ఏపీ రాజకీయాలలో వెబ్ మీడియాలో .. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు న్యూస్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కక్షసాధింపులు చర్యలో భాగంగానే అరెస్ట్ చేశారు అంటూ టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా బాలకృష్ణ అయితే రాత్రి పగలు నిద్ర లేకుండా చంద్రబాబు నాయుడు గారిని బయటికి ఎలా తీసుకురావాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే బాలకృష్ణ తనను నమ్మిన డైరెక్టర్ ల పరిస్థితిని అర్థం చేసుకొని మరి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడారట .

దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి, బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యారు . నిజానికి మరి కొన్ని రోజుల్లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అవ్వాలి . ఇంకా షూటింగ్ పెండింగ్ లోనే ఉంది . అయితే ఇప్పుడు ఆయన షూటింగ్ కి వచ్చే పరిస్థితి లేదు . దీంతో అనిల్ రావిపూడి కి కాల్ చేసి టెన్షన్ పడకు .. మీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత వేరే సినిమాకి కమిట్ అవుతా..అని చెప్పుకొచ్చారట.

అంతేకాదు బాబీకి సైతం కాల్ చేసి “నాకు సినిమా షూట్ కి రావడానికి మరి కొంత సమయం పడుతుంది.. ఈలోపు నువ్వు వేరే ఏ హీరోతోనైనా సినిమా తీసుకో.. లేదు అంటే ఈ కథలో వేరే హీరోని పెడతానన్నా పెట్టుకో.. నాకు ప్రాబ్లం లేదు ..లేదు నాతోనే చేస్తానన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కచ్చితంగా కాల్ షీట్స్ ఇస్తాను అంటూ హామీ ఇచ్చారట”. దీంతో అంత బాధలో ఉన్న బాలయ్య తనని నమ్మిన డైరెక్టర్ ల గురించి ఆలోచించారని అది నందమూరి హీరో అంటే అని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news