MoviesNTR అసలు పేరు ఏంటో మీకు తెలుసా..? జూ ఎన్టీఆర్ గా...

NTR అసలు పేరు ఏంటో మీకు తెలుసా..? జూ ఎన్టీఆర్ గా ఎందుకు మారాడంటే..? దాని వెనక ఇంత కథ ఉందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నందమూరి నటవారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యాన్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఆయన మామ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపడం లేదని .. అసలు రిప్లై ఇవ్వడం లేదని .. ఆయన అరెస్టుపై స్పందించడం లేదు అని పలువురు జనాలు మండిపడుతున్నారు . అంతేకాదు ఎన్టీఆర్ పేరు పెట్టుకునే అర్హత నీకు లేదు అంటూ ఫైర్ అవుతున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి..? పేరు మార్చుకున్నారు..? ఆయన పేరు ఎవరు మార్చారు..? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది .

నిజానికి ఎన్టీఆర్ అసలు పేరు తారక్. ఆ పేరుని స్వయాన సీనియర్ ఎన్టీ రామారావు గారే తారక రామారావు గా మార్చారు. హరికృష్ణ – షాలిని లకు మే 20వ తేదీ 1983లో జన్మించారు ఎన్టీఆర్ . కాగా ఓ రోజు మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ టైంలో భాగంగా తాతను కలవడానికి వెళ్ళాడు తారక్.. అప్పుడే నీ పేరు ఏంట్రా అబ్బాయ్ అని అడగ్గా..? తారక్ అంటూ సమాధానం ఇచ్చాడట.

అక్కడే ఉన్న మేకప్ ఆర్టిస్ట్ లతో.. మేకప్ వేయించి ముచ్చట పడిపోయాడు ఆయన. నువ్వు రాబోయే కాలానికి కాబోయే హీరో అంటూ ముందుగానే ఎన్టీఆర్ జాతకాన్ని చెప్పేశారు . అంతేకాదు ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్ ని కోరారట . మరి ముఖ్యంగా తాత పెట్టిన పేరు కావడంతో ఆ పేరుని అస్సలు మార్చాలి అని అనుకోలేదు ఎన్టీఆర్. ఆ తర్వాత ఫ్యాన్స్ పెద్దాయనను సీనియర్ ఎన్టీఆర్ అని చిన్నాయనను జూనియర్ ఎన్టీఆర్ అని పిలుచుకుంటూ వచ్చారు. ఇన్నాళ్ళ వరకు బాగానే ఉన్న నందమూరి కుటుంబంలో ఇప్పుడు చంద్రబాబునాయుడు అరెస్టు కారణంగా మళ్లీ గొడవలు ఏర్పడ్డాయి అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news