Moviesబిగ్ బాస్ 7: వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇవ్వబోతున్న ఆ ఇద్దరు...

బిగ్ బాస్ 7: వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇవ్వబోతున్న ఆ ఇద్దరు టాప్ స్టార్ సెలబ్రిటీస్..ఇప్పుడు హౌస్ లొ అస్సలు మజా..!!

ఎస్ .. అవునండి ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ .. ఎలాంటి టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు వెళ్తుందో మనకు తెలిసిందే . పరమ చెత్త టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది . మరి ముఖ్యంగా ఈ షోలో పెద్దగా కాంట్రవర్సీ కంటెంట్ క్రియేట్ చేసే కంటెస్టెంట్స్ లేకపోవడంతో అభిమానులకు షో చూడాలని అనిపించడం లేదు. అందరూ డమ్మీ క్యాండిడేట్లే కావడం పైగా హౌస్ లో శివాజీ తప్ప వేరే వ్యక్తులు అంత యాక్టివ్ గా లేకపోవడంతో షోను చూడాలనే ఇంట్రెస్ట్ రావడం లేదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇద్దరు టాప్ సెలబ్రిటీస్ ని పంపించాలి అంటూ డిసైడ్ అయింది బిగ్ బాస్ యాజమాన్యం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఆ ఇద్దరు మరెవరు కాదు . తన అంద చందాలతో సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సుప్రీత ..సురేఖ వాణి కూతురు . అలాగే సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని సినిమాలో కూడా నటిస్తున్న అర్జున్ అంబాటి . ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతుంది బిగ్ బాస్ అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

అంతేకాదు వీళ్ళిద్దరిని ఓ సీక్రెట్ రూమ్ లో ఉంచి మరి హౌస్ లోకి పంపించబోతుందట బిగ్ బాస్. ఆ సీక్రెట్ రూమ్ లో వీళ్లు హౌస్ లో కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు ..?ఎలా ఉంటున్నారు ..? అన్న విషయాలను కూడా చూడొచ్చు. ఆ తర్వాత పర్టికులర్ టైం లో హౌస్ లోకి పంపించబోతున్నారు ఇద్దరినీ అంటూ ప్రచారం జరుగుతుంది. అర్జున్ అంబటి విషయం ఎలా ఉన్నా.. సుప్రిత అందాలు మాత్రం ఈసారి హౌస్ లో రచ్చ రచ్చ చేయబోతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి హౌస్ లో ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news