Moviesప్రభాస్-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.....

ప్రభాస్-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. సెట్ అయ్యుంటే కెవ్వుకేకే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి కారణం బాహుబలి అనే చెప్పాలి . కాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి గా నటించి మెప్పించాడు .

ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మొత్తం మారిపోయింది . అయితే నిజానికి ఈ సినిమాలో విలన్ గా భళ్లాల దేవుడి పాత్రలో రానా దగ్గుబాటి కంటే ముందు గోపీచంద్ ని హీరో విలన్ గా చూస్ చేసుకున్నారట రాజమౌళి . అయితే విలన్ పాత్రలు చేయకూడదు అనే డిసైడ్ అయిన గోపీచంద్ దర్శకధీరుడు రాజమౌళి ఆఫర్ సున్నితంగా రిజెక్ట్ చేశారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

అంతేకాదు ప్రభాస్ సైతం అది టోటల్గా గోపీచంద్ పర్సనల్ మేటర్ ..నేను ఎటువంటి విధంగా ఇన్వాల్వ్ అవ్వను .. అది ఆయన ఇష్టం చేస్తాడంటే చేయనివ్వండి.. వద్దంటే వద్దు దీనివల్ల మా ఫ్రెండ్ షిప్ చెడిపోనివ్వను అంటూ చెప్పుకొచ్చారట . అలా వర్షం తర్వాత వీళ్ళ కాంబోలో రావాల్సిన క్రేజీ సినిమా మిస్ అయిపోయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news