బిగ్ బాస్ అనగానే అందరికీ టక్కున్న గుర్తొచ్చేది గంభీరమైన గొంతు. హౌస్ లో ఎవరు ఏ చిన్న తప్పు చేసిన ఎలాంటి ఫన్ ని క్రియేట్ చేయాలి అన్న బిగ్ బాస్ వాయిస్ ద్వారానే జరుగుతుంది . ఇప్పటికి ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కూడా స్టార్ట్ అయింది . ప్రతిసారి లాగే ఈసారి హౌస్ మేట్స్ రచ్చ రంబోలా క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు. కాగా ఇలాంటి క్రమంలోనే ఇన్నాళ్లు అసలు బిగ్ బాస్ లో మాట్లాడే బిగ్ బాస్ వాయిస్ ఎవరిది..? ఎలా ఉంటాడు..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలే జరిగాయి .
అయితే ఫైనల్లీ అతగాడు ఎవరో తెలిసిపోయింది. ఆయన మరెవరో కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్ . ఇప్పటికీ ఆరు సీజన్లను కంప్లీట్ చేసిన శంకర్ ఏడవ సీజన్ కూడా ఆయన వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండడం గమనార్హం . బిగ్ బాస్ లో ఆయన వాయిస్ వినిపించడానికి శంకర్ నానా తిప్పలే పట్టాడు. ఏకంగా వందమందిలో ఒక్కడిగా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ని మెప్పించాడు. మరి ముఖ్యంగా ఆయన గంభీరమైన గొంతు ఆయనకు ప్లస్ అయింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.
అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో వాయిస్ ఇస్తున్నందుకుగాను.. ఆయనకి సీజన్ 7 కి 30 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారట. కాగా మొదటి సీజన్ కి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న ఈయన ఏడవ సీజన్ కి మాత్రం భారీగానే అందుకుంటున్నాడు.