Newsషారుఖ్ ని ముద్దులతో ముంచెత్తిన దీపిక పదుకునే.. రణవీర్ చేసిన పనికి...

షారుఖ్ ని ముద్దులతో ముంచెత్తిన దీపిక పదుకునే.. రణవీర్ చేసిన పనికి ఫ్యాన్స్ షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా రెచ్చిపోయి నటిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా కొంతమంది అందాల ముద్దుగుమ్మలు పెళ్లయిపోయిన సరే పక్క హీరోలతో ఘాటు రొమాన్స్ చేస్తూ బెడ్ సీన్స్ కూడా చేస్తున్నారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే ఆ విషయంలో ఎటువంటి అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేస్తున్నారు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకునే.

షారుక్ ఖాన్ దీపిక పదుకునే మధ్య ఏదో ఉంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . అంతేకాదు పటాన్ సినిమాలో వీళ్ల రొమాన్స్ చూఇస్న తర్వాత వామ్మో అంటూ కళ్ళు మూసుకునే స్థాయికి వెళ్లిపోయారు అభిమానులు . అయితే రీసెంట్ గా మరోసారి జవాన్ సినిమాలోను అదే ప్రూవ్ చేసుకున్నారు . తెరపై చాలా హెల్దీ రొమాన్స్ ను చూపించి వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీని అందరికీ తెలిసేలా చేశారు డైరెక్టర్ అట్లీ.

అయితే ఇదంతా సినిమాలో వరకే అనుకున్న జనాలకు దీపికా పెద్ద షాక్ ఇచ్చింది. రీసెంట్గా దీపిక ఆఫ్ స్క్రీన్ లో కూడా షారుక్ ఖాన్ ని హగ్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టింది . దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అయితే రన్వీర్ సింగ్ కి కూడా ఇంత ఘాటుగా ముద్దు పెట్టలేదని పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. రీసెంట్ గా జవాన్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారుమూవీ టీం. ఈ కార్యక్రమానికి షారుక్ , అట్లీ , విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తో పాటు దీపికా పదుకొనే కూడా హాజరైంది . కాగా ఇలాంటి క్రమంలోనే ఆమె షారుఖ్ ని ఘాటుగా ముద్దు పెట్టుకున్న ఫోటో వైరల్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే భార్య వేరే మగాడిని ముద్దు పెట్టుకున్న ఫోటో పై స్పందించాడు రణవీర్. “నా హృదయం ప్రేమతో నిండిపోయింది “అంటూ రన్వీర్ సింగ్ కామెంట్ చేశాడు . దీంతో సోషల్ మీడియాలో ఇదే ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news