Newsఫ్లాప్ అవుతుంది అని తెలిసినా బన్నీ నటించిన ఆ చెత్త సినిమా...

ఫ్లాప్ అవుతుంది అని తెలిసినా బన్నీ నటించిన ఆ చెత్త సినిమా ఏంటో తెలుసా.. ఎందుకు చేశారంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న.. స్టార్ హీరో అల్లు అర్జున్ కి ఎక్కువ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. . మరీ ముఖ్యంగా నేటి కాలం జనరేషన్ ఎక్కువగా అల్లు అర్జున్ సినిమాలను లైక్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా యువత అల్లు అర్జున్ స్టైల్ ను ట్రెండ్ ని ఫాలో అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అల్లు అర్జున్ ఏ విషయంలో నైనా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు అని.. ఆలోచించి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటాడని..అందుకే ఆయన నిర్ణయాలు బాగుంటాయని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు .

అయితే అల్లు అర్జున్ తీసుకున్న ఓ నిర్ణయం సొంత ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు . ఇదే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి మరి ఆ సినిమాలో నటించి ఆయన పరువు తీసుకున్నారు .. ఆ సినిమా మరేదో కాదు “నా పేరు సూర్య నా ఊరు ఇండియా”. అల్లు అర్జున్ ఎన్నో సినిమాలో నటించాడు కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో నటించినందుకు ఆయన ఫ్యాన్స్ అయితే ఫైర్ అయ్యారు .

అసలు ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నావు బన్నీ..? అంటూ సోషల్ మీడియా ద్వారా అడిగి కడిగేశారు. నిజానికి నిజానికి డైరెక్టర్ వక్కంతం – వంశీ అల్లు అర్జున్ వద్దకు వచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడే అల్లు అర్జున్ కి ఈ సినిమా పోదు అని బాగా తెలిసిపోయిందట . అల్లు అర్జున్ దగ్గర నుంచి రొమాంటిక్ ఫన్నీ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు.. కానీ ఇలా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయరు అని బన్నీ కి తెలిసిందట. కానీ తన కెరియర్ లో ఒక్క సినిమా అయినా సరే పెట్రియాటిక్ ఫీలింగ్ కలిగిన సినిమా ఉండాలి అంటూ ఆయన ఈ సినిమా తీసుకున్నాడట. ఇలా అల్లు అర్జున్ ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి మరి నటించడం అప్పట్లో సంచలనంగా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news