News"వాన" మూవీ హీరో కి వరుణ్ తేజ్ కు మధ్య ఉన్న...

“వాన” మూవీ హీరో కి వరుణ్ తేజ్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..మోస్ట్ స్పెషల్..!!

“వాన”.. ఈ సినిమా 2008లో రిలీజ్ అయింది . చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎం ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా క్రేజీ టాక్ ను అందుకుంది. కమర్షియల్ గా పెద్దగా హిట్ కాకపోయినా.. సరే నటన పరంగా.. కధ పరంగా లవర్స్ కు ఎంతో నచ్చేసింది . ఈ సినిమాలో హీరోగా నటించిన వినయ్ రాయ్ నటన అందరిని ఆకట్టుకునింది .

ఈ సినిమాలో హీరోయిన్ మీరా చోప్రా తర్వాత పలు సినిమాలో నటించిన విషయం తెలిసిందే . అయితే హీరో వినయ్.. అడపాదడప కొన్ని సినిమాల్లో నటించిన సరే తెలుగులో పెద్దగా సంపాదించుకోలేకపోయాడు . కానీ ఈ హీరో ఇంగ్లీష్ భాషల్లో బాగా నటించి మెప్పించారు. మరి ముఖ్యంగా ఈయన హీరోగా కంటే విలన్ గానే బాగున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి . 2017లో విశాల్ నటించిన డిటెక్టివ్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు .

ఈ మూవీ అతనికి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది . అంతేకాదు ఆ తర్వాత పలు తెలుగు తమిళ మలయాళ భాషల్లో ప్రతి నాయకుడు పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించుకున్నాడు . అయితే చాలా కాలం తెలుగు తెరపై కనిపించని ఈయన రీసెంట్గా వరుణ్ తేజ్ నటించిన “గాండీవ దారి అర్జునా”లో వినయ్ రాయ్ ప్రతినాయకుడు పాత్రలో నటించి మెప్పించాడు ఇలా తెలుగులో అప్పుడప్పుడు నటించిన వినయ్ రాయ్ మళ్లీ వరుణ్ తేజ్ సినిమాతోనే కనిపించడం విశేషం . ప్రజెంట్ వినాయ్ రాయ్.. ప్రశాంత్ వర్మ తెరకెకిస్తున్న సైన్స్ ఫిక్షన్ హనుమాన్ మూవీలో నటిస్తున్నాడు . చూడాలి మరి ఈ సినిమా ద్వారా ఆయన ఎలాంటి హిట్ అందుకుంటాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news