మాస్ మహారాజ్ రవితేజ హీరోగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న భారీ బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు. గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకాలోని స్టువర్ట్‌పురం గజదొంగ బయోపిక్ ఇది. ఈ సినిమాను వచ్చేనెల 20 తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ వరుస ప్లాపుల్లో ఉన్నా కూడా ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగింది.
నాన్ ధియేటర్ కింద ఇంకా శాటిలైట్ కాకుండానే రు. 49 కోట్లు వచ్చింది. థియేటర్ బిజినెస్ కూడా దాదాపు క్లోజ్ చేసేసారు. ఓవర్సీస్ కర్ణాటక మినహా మిగిలిన ఏరియల్ అన్ని క్లోజ్ అయ్యాయి. ఆంధ్ర ను హోల్‌సేల్గా రు. 17 కోట్లకు ఉషా పిక్చర్స్ కొనేసింది. సీడెడ్ 5.40 కోట్లకు ఇచ్చారు. నైజాం మాత్రం రు. 9 కోట్ల అడ్వాన్స్ మీద ఆసియన్ సినిమాస్‌కు డిస్ట్రిబ్యూషన్కు ఇచ్చేశారు. మొత్తం మీద చూసుకుంటే దాదాపు రు. 80 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది.
సినిమాకు కాస్త భారీగానే ఖర్చయింది. హీరో రెమ్యూనరేషన్ కాకుండా రు. 50 కోట్లకు పైగా సినిమాకు బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే టైగర్ నాగేశ్వరరావుకు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే అనుకోవాలి. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక దసరా కానుకగా అటు విజయ్ లియో, భగవంత్ కేసరి సినిమాలతో పోటీపడుతూ టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కాబోతోంది.