టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఐకాన్ హీరో అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . డాడీ సినిమాలో చిన్న రోల్ లో కనిపిస్తే ఆయనను అంతలా అభిమానించారు జనాలు . కాగ గంగోత్రి సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.
అల్లు అర్జున్ కు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ..యంగ్ స్టర్స్ .. ముసలి వాళ్ళు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రీసెంట్గా అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్ ఓ బాబు మరణించారు. అల్లు అర్జున్‌కు కష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన 12 ఏళ్ల శ్రీవాసుదేవ వీరాభిమాని. ఎంతలా అంటే బన్ని సినిమాలు ఖచ్చితంగా మిస్ కాకుండా చూస్తాడు. అయితే చిన్నతనంలోనే పిల్లాడు క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆ బాబు.. తనకు వీరాభిమాని అని తెలిసిన బన్నీ.. వెంటనే అతడిని కలుసుకునేందుకు రెడీ అయ్యి వెళ్తుండగా… కాని ఈలోపే ఆ బాబు మరణించాడు అన్న విషాద వార్త అందింది,
అంతేకాదు చిన్నపిల్లలు అంటే మొదటి నుంచి ఇష్టం ఉన్న బన్నీ ఈ బాధలు తట్టుకోలేక గుక్క పట్టి ఏడ్చేసాడట . అంతేకాదు ఆ దేవుడు ఎందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అంటూ కూడా బాధపడిపోయారట . అంతేకాదు ఆ బాబు తల్లిదండ్రులకు నేనున్నాను అంటూ ధైర్యం ఇవ్వడమే కాకుండా .. ఆ కుటుంబంకు పూర్తి అండగా నిలుస్తాను అంటూ హామీ ఇచ్చారట. దీంతో బన్నీ ఫాన్స్ బన్నీలో ఉన్న మంచితనాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు..!!