టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల ఇంట విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆవు చనిపోయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నేను మొదటిసారి ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. చాలా బాధగా ఉంది.. మేము దాన్ని మా ఇంటి సభ్యురాలుగా చూసుకున్నాం.. 13 ఏళ్లుగా దానికి మా ప్రేమను పెంచాము.. నా కూతురైతే ఆ అవును ఎంతో ప్రేమగా లక్ష్మీ అని పిలిచేదని చెప్పారు
మా లక్ష్మీ చనిపోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో పాటు దాని ఫోటో కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల పెట్టిన ఈ పోస్టు వైరల్ గా మారింది. ఇక నీకోసం సినిమాతో దర్శక రచయితగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు శ్రీను వైట్ల. ఆనందం – వెంకీ – రెడీ – దూకుడు -బాద్ షా వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించాడు.
అయితే గత కొన్ని నీళ్లు గా శ్రీను వైట్ల చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోవడం లేదు. శ్రీనువైట్ల చివరగా 2018లో రవితేజతో తీసిన అమర్ అక్బర్ అంటోనీ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో అతడు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం చాలా కాలం గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరికీ ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం.