ఈ మధ్యకాలంలో స్టార్స్ లైఫ్ లో జరగబోయే విషయాలను ముందుగానే సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేసే వేణు స్వామి రోజుకో స్టార్ హీరోయిన్ విషయాలను బయటపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో , రాజకీయాల్లో ఉండే ప్రముఖుల జాతకాలను బయటపెట్టిన వేణు స్వామి.. తాజాగా సినిమా ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల జాతకాన్ని బయట పెట్టాడు .
రీసెంట్గా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేణు స్వామి శ్రీలీల జాతకాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఆయన ఆమె అభిమానులను ఫుల్ సాటిస్ఫై చేసేసారు. ఆయన శ్రీలీల జాతకం గురించి వేణు స్వామి మాట్లాడుతూ..” శ్రీలీల జాతకం అద్భుతం అని .. ఆమె లాంటి జాతకం చాలా తక్కువ మందికే ఉంటుందని చెప్పుకొచ్చాడు”.
అంతేకాదు శ్రీలీల జాతకం ప్రకారం ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు శ్రీ లీల 2028వ సంవత్సరానికి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని.. ఆమెది మీనరాశి అని ఆమెకు రాజయోగం ఉంది అని కూడా చెప్పుకొచ్చారు. . అంతేనా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా టాప్ హీరోయిన్గా ఉన్న నయనతార జాతకం కు చాలా దగ్గరగా ఈమె జాతకం ఉందని .. నయనతార ప్రజెంట్ ఎలాంటి క్రేజ్ తో అయితే ముందుకెళ్తుందో అలాంటి క్రేజ్ తోనే శ్రీలీల ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల నయనతార పేర్లను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు శ్రీలీల తో ఎక్కువ సినిమాలు చేయడానికి డైరెక్టర్స్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..!!