ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుని చేతిలో పదికి పైగానే సినిమాలు పెట్టుకుని ఉన్న శ్రీ లీల ..త్వరలోనే ఐటెం సాంగ్ లో కనిపించబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఇప్పటివరకు శ్రీలీల ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించడానికి సిద్ధపడిపోయింది.
డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించడానికి ఫిక్స్ అయిపోయింది. అయితే చాలామంది అమ్మడు ఐటెం సాంగ్స్ లో నటించదని ..హీరోయిన్గా కెరియర్ స్టార్ పొజిషన్లో ఉంటే ఆమె ఎందుకు ఐటెం సాంగ్స్ లో నటిస్తుంది అంటూ కామెంట్ చేశారు . అయితే తాను ఎలాంటి రోల్స్ నైనా ..ఎలాంటి డాన్స్ అయినా చేయగలను అని ప్రూవ్ చేయడానికి శ్రీ లీల ఓ బడా హీరో సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ రాగానే ఓకే చేసింది .
త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్ అఫీషియల్ గా ప్రకటించబోతుంది అంటూ కూడా తెలుస్తుంది . దీంతో ఫాన్స్ కు ఆ ముచ్చట కూడా తీర్చేయబోతుంది శ్రీ లీల అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు శ్రీలీల ఐటెం సాంగ్ లో నటిస్తే ఆ తరువాత ఆమె కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఇంటృఎస్టింగా మారింది..!!