టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాల శివ.. ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారానే తెలుగులో డెబ్యూ ఇవ్వబోతుంది. అయితే నిజానికి దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా ఎంతో మందిని ఊహించుకున్నారట కొరటాల శివ .
ఫైనల్లీ జాన్వీ కపూర్ అయితే బాగుంటుంది అంటూ ఆమెను ఫిక్స్ చేశారట . అయితే ఈ సినిమా కోసం ఒకే ఒక కండిషన్ పెట్టాడట కొరటాల . అదే ట్రెడిషనల్ లుక్స్. జాన్వి బయట ఎంత బోల్డ్ గా ఉంటుందో మనకి తెలిసిందే. మరి ముఖ్యంగా హాట్ ఎక్స్పోజింగ్ చేయడంలో జాన్వీ తర్వాతే మిగతా ఎవరైనా అని జనాలు అంటుంటారు .
అయితే జాన్వి సినిమాలో చాలా ట్రెడిషనల్ గా కనిపించాలి అని ..ఆ స్టైల్ ని మైంటైన్ చేయమంటూ కండిషన్ పెట్టారట. ట్రెడిషనల్ లుక్స్ లో ఒక అమ్మాయి ఎలా కనిపిస్తుంది.. ఎలా నడుస్తుంది.. ఎలా తన ప్రవర్తన ఉంటుంది నేర్చుకోమంటూ సజెస్ట్ చేశారట. అవన్ని నేర్చుకుని ఆడిషన్ ఇస్తేనే చూస్ చేసుకుంటాను అంటూ చెప్పారట. జాన్వి కపూర్ సైతం అందుకు ఒప్పుకోవడంతోనే ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ తెలుస్తుంది..!!