ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్లు కొడుతూ ఉండటం చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చేయాల్సిన సినిమా కొన్ని కారణాలవల్ల మిస్ అవ్వగా ఆ తర్వాత చాలా సంవత్సరాలకు.. అదే కథను బాలకృష్ణ తన కెరీర్లో మెమొరబుల్ హిట్ సినిమాగా మలుచుకున్నారు. ఆ సినిమా ఏదో కాదు బాలయ్య కెరీర్ లో వందో సినిమాగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి.
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాకు పోటీగా వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమా చేయడానికి ముందు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేయాలని అనుకున్నారు. తాను శాతకర్ణిగా తన కుమారుడు పులోమావి పాత్రకు విక్టరీ వెంకటేష్ ను పెట్టాలని అనుకున్నారు.
వెంకటేష్ కూడా సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నందుకు ఆనందపడ్డారు. అయితే 1994 ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత శాతకర్ణి ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది.
ఆ తర్వాత చాలా ఏళ్లకు ఇదే కథతో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. అలా ఎన్టీఆర్ తో నటించి ఒక మంచి ఛాన్స్ వెంకటేష్ మిస్ అవ్వగా.. అదే కథను బాలయ్య చేసి సూపర్ హిట్ కొట్టడం విశేషం.