సీనియర్ హీరో శ్రీకాంత్ – హీరోయిన్ ఊహ ప్రేమ పెళ్లి అప్పట్లో ఒక సంచలనం. ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు.. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ముందుగా ఊహను ఇష్టపడ్డాడు. ఈ విషయాన్ని ఆమెకి చెప్పలేదు. ఊహను అప్పుడు తన ఇంట్లో జరిగే శుభకార్యాలు.. ఇతర ఫంక్షన్లకు ఆహ్వానించేవాడు. అలా ఊహ తన ఇంటికి వచ్చిన క్రమంలో ఆమె మన ఇంటి కోడలు.. నాకు కాబోయే భార్య అంటూ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేశాడు.
ఆ తర్వాత ఊహకు ప్రపోజ్ చేశాడు. ఊహ కుటుంబ సభ్యులు హీరోను పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా ?ఉంటుందో అంటూ రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను అల్లుడుగా చేసుకునేందుకు ఊహ తల్లిదండ్రులు ఇష్టపడలేదట. వెంటనే శ్రీకాంత్ తాను సొంత అన్నగా భావించే మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి వాలిపోయాడు. తన ప్రేమ విషయం చెప్పాడు.
అప్పుడు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి ఊహ తల్లిదండ్రులతో మాట్లాడి శ్రీకాంత్ నా తమ్ముడు.. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి.. వాడి భవిష్యత్తుకు నాది హామీ అని స్వయంగా హామీ ఇవ్వడంతో ఊహ తల్లిదండ్రులు మెత్తబడ్డారు. చివరకు శ్రీకాంత్ కు తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు.
అలా మెగాస్టార్ చిరంజీవి మధ్యవర్తిగా శ్రీకాంత్ – ఊహ పెళ్లి జరిగింది. ఇక ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా కుమారుడు రోషన్ పెళ్లిసందడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.