సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే క్లిక్ అవుతారు. కొందరు హీరోయిన్లు అయితే ఐదు సంవత్సరాలు 10 – 15 సంవత్సరాలు కూడా ఇండస్ట్రీలో అలా కొనసాగుతూనే ఉంటారు. అలాంటి వారి లిస్టులో నయనతార టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతోంది.
ఎంతోమంది బ్యూటీలు వస్తున్నారు వెళ్తున్నారు.. కానీ నయనతారకు మాత్రం పోటీగా ఎవరు నిలబడటం లేదు. నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. అయినా కూడా ఆమె క్రేజీ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా షారుక్ ఖాన్ కి జోడిగా ఆమె నటించిన జవాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ అత్యధిక స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో నయనతారకు పోటీ వచ్చేవారు కూడా లేరు.
తాజాగా నయనతార రెమ్యూనరేషన్ రు. 10 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. జిఎస్టి తో కలిపి ఆమె 11 కోట్లు డిమాండ్ చేస్తుంది అంట. ఇప్పుడున్న లైనఫ్లో ఆమెతో సినిమాలు చేసేందుకు ఎంతో మంది హీరోలు రెడీగా ఉన్నారు. అయితే ఆమె చెబుతున్న రేటు చూసి నిర్మాతలకు చుక్కలు కనపడుతున్నాయి అట. జవాన్ లాంటి పెద్ద ప్రాజెక్టులు అయితే ఓకే..! మీడియం రేంజ్ హీరోలు, దర్శక నిర్మాతలు మాత్రం నయనతారతో సినిమాలు అంటే భయపడిపోతున్న పరిస్థితి.