Moviesవరుణ్ తేజ్ పెళ్లికి స్పెషల్ గెస్ట్.. ఇప్పటి వరకు మెగా ఆల్బమ్...

వరుణ్ తేజ్ పెళ్లికి స్పెషల్ గెస్ట్.. ఇప్పటి వరకు మెగా ఆల్బమ్ లో లేని అతిధి..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులారిటీ సంపాదించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పెట్టలేకబోతున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న ఈయన ఎట్టకేలకు తన పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు . జూన్ 9వ తేదీ నాగబాబు నివాసంలో గ్రాండ్గా నిశ్చితార్థంతో వీళ్ళ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన వరుణ్ – లావణ్య ..నవంబరు ఒకటవ తేదీ ఇటలీలో వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది .

ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు హాజరు కావడం లేదని.. కేవలం మెగా – అల్లు – లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారని తెలుస్తుంది . అయితే మెగా ఫ్యామిలీలో ఈసారి జరిగే పెళ్లి చాలా చాలా స్పెషల్ అని .. ఇప్పటివరకు మెగా హీరోల పెళ్లి ఆల్బమ్ లో లేని ఓ స్పెషల్ గెస్ట్ పిక్చర్ ఈసారి ఆల్బమ్ లో యాడ్ అవ్వబోతుంది అంటూ మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు .

ఆ లక్కీ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు “క్లిన్ కార”. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనలకు ఈ మధ్యనే కూతురు పుట్టింది. మెగా వారసురాలుగా చిరంజీవి కూడా ప్రకటించేశాడు . దీంతో మెగా ఫ్యామిలీ లో జరిగే వరుణ్ తేజ్ పెళ్లి స్పెషల్ గా మారిపోతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news