Moviesసమంత ఫేవరేట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..? ఇష్టం లేనిది మాత్రం...

సమంత ఫేవరేట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..? ఇష్టం లేనిది మాత్రం ఆయనే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత రీసెంట్ గా నటించిన మూవీ ఖుషి ..శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది . ఈ సినిమాలో రౌడీ హీరోగా పిలిపించుకునే విజయ్ దేవరకొండ నటించాడు . ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేతుల్లో రెండు సినిమాలు ఉన్నాయి . ప్రెసెంట్ ఆ సినిమా షూట్స్ లో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత పర్సనల్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

కాగా సమంత ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో నటించిన హీరోస్ లలో సమంత మోస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ నే అంటూ చెప్పుకొస్తుంది . సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది . అత్తారింటికి దారేది సినిమా కంటే ముందే పవన్ కు వీరాభిమాని గా మారిపోయాను అని.. ఆ సినిమా షూట్ టైంలో పవన్ కు మరింత ఫ్యాన్ గా మారిపోయానని .. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎన్ని సినిమాల్లోనైనా నటిస్తానని ..నో చెప్పనని చెప్పుకొచ్చింది .

అయితే ఇదే క్రమంలో సోషల్ మీడియాలో పలువురు సమంత ఫ్యాన్స్ ఆమెకు ఇష్టం లేని హీరో మాత్రం నాగచైతన్యఅని చెప్పుకొస్తున్నారు . అది ప్రత్యేకంగా ఆమెను అడగాల్సిన అవసరం లేదని ..నమ్మించి మోసం చేసిన ఏ మగాడిని ఏ అమ్మాయి ఇష్టపడదని.. ఆ విధంగా చూసుకుంటే సమంతకు ఇష్టం లేని హీరో నాగచైతన్యానే వస్తాడని చెప్పుకొస్తున్నారు . దీంతో మరోసారి నాగచైతన్య – సమంతల పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news