Moviesపెళ్లైన హీరోల‌ను ప్రేమించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే… పైగా స‌హ‌జీవ‌నం కూడా…!

పెళ్లైన హీరోల‌ను ప్రేమించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే… పైగా స‌హ‌జీవ‌నం కూడా…!

సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు పెళ్లయిన హీరోలను ప్రేమించి వారితో సహజీవనం కూడా చేశారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. టాలీవుడ్లో ఇప్పటికే పెళ్లయిన హీరోలను కొందరు అగ్ర హీరోయిన్లు ప్రేమించిన మాట వాస్తవం. హీరోయిన్ ఛార్మి రమ్యకృష్ణ భర్త డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రేమలో పడ్డారని.. ఆకారణంగానే రమ్యకృష్ణ – కృష్ణవంశీ మధ్య గొడవలు జరిగాయన్న పుకార్లు ఉన్నాయి

కృష్ణవంశీ తర్వాత అదే చార్మి పెళ్లి అయిన మరో డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ తో కూడా సహజీవనం చేస్తుందన్న పుకార్లు తెలిసింది. ఇక చార్మి – పూరి కలిసే సంయుక్తంగా సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో సీనియర్ హీరో నాగార్జున పై మోజు పడిందని అంటారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక నయనతార అప్పటికే పెళ్లయిన ప్రభుదేవాతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి వరకు వెళ్ళాక విడిపోయారు.

ఇక యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లై పిల్లలు ఉన్న ఉదయ‌నిది స్టాలిన్ తో ప్రేమలో పడిందని అంటారు. సీనియర్ హీరో కమలహాసన్ కుమార్తె శృతిహాసన్ పెళ్లయిన హీరో ధనుష్‌తో సంబంధం పెట్టుకుందని అంటారు. మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా పెళ్లయిన కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్తో ప్రేమాయణం నడిపిందని నెట్టింట‌ చాలానే వార్తలు వినిపించాయి.

త్వరలోనే విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చేసి కీర్తిని రెండో పెళ్లి చేసుకుంటాడు అన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది క్రేజర్ హీరోయిన్లు పెళ్లి అయిన హీరోలు, అబ్బాయిలతో సంబంధాలు పెట్టుకుని వార్తల్లోకి ఎక్కుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news