Moviesత‌న‌కు ప్లాపులిచ్చిన హీరోయిన్‌తోనే చిరు మ‌ళ్లీ రొమాన్స్‌…!

త‌న‌కు ప్లాపులిచ్చిన హీరోయిన్‌తోనే చిరు మ‌ళ్లీ రొమాన్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా వచ్చిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా కురసాల కళ్యాణకృష్ణ – బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించే సినిమాపై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో నయనతార కూడా హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క శెట్టితో పాటు మృణాల్‌ ఠాకూర్ పేర్లు ఫైనల్ కాగా మరో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను తీసుకున్నారని టాక్. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని న‌య‌న‌తార‌ను హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ కి జోడిగా జవాన్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నయనతార చిరంజీవి సినిమాకు ప్లస్ కానుందని అంటున్నారు.

అయితే ఇప్పటికే నయనతార – చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సైరా – గాడ్ ఫాదర్ సినిమాలు రెండు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి నయనతార తోనే చిరు జోడి కట్టబోతున్నాడు. ఈసారి అయినా నయనతార చిరంజీవికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు సోషియో ఫాంట‌సీ డ్రామా అదిరిపోతుందని తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news