టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .. లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుంది . కాగ ఆ తర్వాత కాజల్ ఎన్ని అవార్డ్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని బిడ్డను కన్నేసిన కాజల్ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి చాలా ఆలోచించిందట . అప్పుడే పుట్టిన బిడ్డ ను వదిలి రాలేక.. ఒకవైపు మంచి మంచి అవకాశాలు వస్తుంటే తన డ్రీమ్స్ మిస్ చేసుకోలేక చాలా నలిగిపోయిందట . ఈ క్రమంలోనే కాజల్ భర్త గౌతమ్ ఆమె కు సపోర్టుగా నిలిచారట . అంతేకాదు ఆమె వద్దకు వచ్చిన ఆఫర్స్ లో డైరెక్టర్ కి కాల్ చేసి మరి ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళ ముందే కాజల్ ని అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించారట.
బాబును చూసుకోవడానికి మేమున్నాం .. నువ్వు నీ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకో అంటూ చాలా సపోర్టివ్ గా మాట్లాడారట. ఆ కారణంగానే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిందని.. లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ కే రాకూడదు అనుకునింది అని ..ఫ్రెండ్స్ చెప్పుకు వస్తున్నారు .. మొత్తంగా కాజల్ చేత బలవంతంగా సైన్ చేయించి మరి ఆమె కోరిక తీర్చేసాడు గౌతమ్ కిచ్చులు..!!