టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా.. అందరి కంటికి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున అక్కినేని – అమల జంట . ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే . అంతకుముందే నాగార్జునకు పెళ్లయింది ఓ బిడ్డ కూడా ఉన్నాడు. అయినా సరే ఆమెకు డివర్స్ ఇచ్చి బిడ్డను తీసుకొని అమలను పెళ్లి చేసుకుని మరో బిడ్డకు నాన్న అయ్యి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాడు. కాగా నాగార్జున అమల ప్రేమంటే అందరికీ ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్. వీళ్ళ ప్రేమలో ఎన్నెన్నో సస్పెన్స్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి.
కాగా పెళ్లయిన ఇన్నేళ్లకు కూడా వీళ్లు ఇంతే చక్కగా అన్యోన్యంగా ఉండడం చూసి నేటి కుర్ర జంటలు ఎవీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని ఎంతోమంది స్టార్స్ చెప్పుకు వస్తూ ఉంటారు . రీసెంట్గా సోషల్ మీడియాలో అమల బలవంతంగా నాగార్జునకు ఇష్టం లేకపోయినా సరే ఆయన చేత అలాంటి పని చేయిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్ అమల మొదటి నుంచి హెల్త్ పట్ల చాలా కాన్షియస్ గా ఉంటుంది . అంతేకాదు చాలా స్ట్రిక్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది .
ఇండస్ట్రీలో నాగార్జున ఇప్పటికీ ఇంత అందంగా ఉండడానికి కారణం అమల అనే చెప్పుకొస్తూ ఉంటారు అందరూ . నాగార్జున మంచి ఫుడీ కడుపునిండా తినాలి అనుకునే టైప్. అయితే అమలా మాత్రం ఫుడ్ విషయం లో కండీషన్స్ పెట్టేస్తుందట . ఆయనకు నచ్చిన ఫుడ్ ఇచ్చినా..కానీ అన్ని కొలతల్లో పెడుతుందట. అంతేకాదు ఇష్టమైన ఫుడ్స్ అన్ని చేసి పెడుతుందట కానీ..అన్ని స్మాల్ క్వాంటిటీస్ లోనే పెడుతుందట. దీంతో నాగ్ పై ఫన్నీ మీమ్‌స్ వైరల్ చేస్తున్నారు మీమర్‌స్ .. ఏ మగాడికి ఇలాంటి కష్టం రాకూడదు బాస్ అంటూ జాలీ పడుతున్నారు..!!