సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణికి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అప్పుడెప్పుడో “ఎవరే అతగాడు” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి మెప్పించి హిట్లు ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా సూపర్ హిట్ హీరోయిన్గా మారిపోయింది .
అయితే కెరియర్ లో తీసుకున్న కొన్ని తప్పుడు డెసీషన్స్ కారణంగా .. సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్లపాటు బ్రేక్ చెప్పిన ప్రియమణి .. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుంది . రీసెంట్గా జవాన్ సినిమాలో నటించి తనకంటూ స్పెషల్ మార్కులు వేయించుకున్న ప్రియమణి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో తాడు నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది . సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి హీరోయిన్ ప్రియమణి పుష్ప2 సినిమాలో నటించబోతుంది అని.. సినిమాను మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగింది .
అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇస్తూ ..”నిజానికి ఎలాంటి అదృష్టం నాకు రాలేదని .. అలాంటి అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోనని ..పుష్ప2 సినిమాలో నేను నటించడం లేదని ..ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదని” కూడా చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ప్రియమణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!