నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 19 ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా… కీలక పాత్రలో బాలయ్యకు కూతురుగా క్రేజీ బ్యూటీ శ్రీలీల కనిపించబోతుంది.
సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరో తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ హీరోయిన్ కు దక్కుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ కంటే కూడా కీలకపాత్రలో నటిస్తున్న శ్రీలీల ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. శ్రీలీలకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక కాజల్ అగర్వాల్ నుంచి రెమ్యనరేషన్ 90 లక్షల నుంచి కోటి రూపాయల లోపు అని సమాచారం. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్న ఆమె చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. శ్రీలీలతో భగవంత్ కేసరికి మరింత క్రేజ్ యాడ్ అవడంతో ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
కాజల్‌ను ఇప్పటికే ఎవరూ పట్టించుకోవడం లేదు. భగవంత్ కేసరి సినిమాలో కాజల్ ఉన్నా కూడా ఆమె గురించి అస్సలు టాపిక్ కూడా లేదు. అందరూ శ్రీలీల పేరే తలుస్తున్నారు. రాకరాక ఆమెకు బాలయ్య సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఆమెకు ఛాన్స్ రావడమే ఎక్కువ. ఇంకా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇప్పుడు ఇచ్చే సీన్ లేదనే చెప్పాలి.