Movies"మీ సినిమా నేను చేయలేను సార్"..బిగ్ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చిన...

“మీ సినిమా నేను చేయలేను సార్”..బిగ్ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చిన శ్రీలీల.. రష్మిక పిచ్చ హ్యాపీ..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ హీరో నితిన్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న వెంకీ కడుముల సినిమా నుంచి యంగ్ బ్యూటీ హీరోయిన్ శ్రీలీల బయటకు వచ్చేసిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అంతకుముందే ఈ పాత్రలో హీరోయిన్గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రష్మిక మందన కూడా ఈ పాత్ర నుంచి బయటకు వచ్చేసింది .

అయితే ఆ తర్వాత రష్మిక మందన్నా ప్లేసులో శ్రీలీలను చూస్ చేసుకున్నారు మేకర్స్ . నితిన్ – శ్రీలీల కాంబో బాగుంటుంది అని .. జంట కూడా తెరపై సక్సెస్ అవుతుందని .. చాలా ధీమా వ్యక్తం చేశారు . ఆల్రెడీ వీరిద్దరూ కలిసి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన డేంజర్ పిల్ల సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ కాంబో సెట్ చేస్తే బాగుంటుంది అంటూ వెంకీ కుడుములు నితిన్ స్రీలీల ను హీరో హీరోయిన్లుగా చూస్ చేసుకున్నారు .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుంచి శ్రీలీల కూడా తప్పుకునింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మైత్రి మూవీ మేకర్స్ టీం తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే చేతి నిండా బిజీ షెడ్యూల్ ఉండడంతో శ్రీ లీల ఎటు కాకుండా ఇబ్బంది పడుతుందని..అందుకే ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోకుండా లాస్ట్ మూమెంట్ లో కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news