మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ డేస్ ..ఇంపార్టెంట్ డేస్ గా గుర్తుండిపోతాయి . కొందరికి పుట్టినరోజులు ..కొందరికి పెళ్లిరోజులు.. కొందరికి ప్రపోజల్ డే.. మరికొందరికి తన ప్రేయసిని ఫస్ట్ చూసిన రోజులు ..ఇలా మన లైఫ్ లో ఎన్నో ఎన్నో బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అలానే జూనియర్ ఎన్టీఆర్ కి స్పెషల్ మూమెంట్ ఉంది. అయితే అది ఆయన పుట్టిన రోజు కాదు.. ఆయన పెళ్లిరోజు కాదు ..ఆయన చావు అంచుల వరకు వెళ్లి బ్రతికి మళ్ళీ బయటపడిన రోజు .
ఎస్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో..2009 లో టిడిపి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే . అదే టైంలో ఖమ్మం నుండి హైదరాబాద్ కి వస్తూ ఉండగా ఓ భారీ యాక్సిడెంట్ జరిగింది . ఈ యాక్సిడెంట్లో తారక్ తీవ్రంగా గాయపడ్డారు ..- తల భుజం మోచేతులు.. బాగా ఫ్రాక్చర్ అయిపోయాయి. అదృష్టవశాత్తు ఎన్టీఆర్ ప్రాణులతో బయటపడ్డారు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతలా బాధపడ్డారో మనం చూసాం .
కాగా ఆక్సిడెంట్ జరిగింది మార్చి 26 వ తేదీన..ఆ డేట్ ఎప్పటికీ మర్చిపోలేరట ఎన్టీఆర్ . అంతేకాదు ప్రతి సంవత్సరం మార్చి 26 న ఆయన స్పెషల్ గా ఆడేను గుర్తు చేసుకుంటారట. ఆశ్చర్యం ఏంటంటే అదే రోజు తన భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజు . అందుకే తన ఇంట్లో ఆరోజు రెండు కేక్ కటింగ్ లు జరుగుతాయట . ఒకటి లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు.. అయితే ఒకటి తనకు పునర్జన్మను కలిగించిన ఆ రోజుని తారక్ ఎంతో స్పెషల్గా గుర్తు చేసుకుంటారట. ఇదే విషయం గతంలో ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు ఎన్టీఆర్. ప్రజెంట్ ఇదే న్యూస్ మరోసారి ట్రెండ్ అవుతుంది..!!