ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకు దగ్గుబాటి అభిరాం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సినిమాలపరంగా దగ్గుబాటి అభిరామ్ ఎంత పాపులారిటీ తగ్గించుకున్నాడో తెలియదు .. కానీ శ్రీ రెడ్డి మేటర్ లో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. శ్రీరెడ్డిని దగ్గుబాటి అభిరామ్ వాడుకొని వదిలేశాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే దగ్గుబాటి అభిరాం ఆ విషయంపై మాత్రం ఎటువంటి విధంగా స్పందించడం లేదు. కాగా రీసెంట్ గానే తెలుగు ఇండస్ట్రీలోకి డైరెక్టర్ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన అహింస సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు . ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . దీంతో సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ చెప్తూ బిజినెస్ లు స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు దగ్గుబాటి అభిరామ్. అంతేకాదు ఆయన తన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు .
సురేష్ బాబు చెల్లెలు కూతురుని ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు . అంతే కాదు వీళ్ళ పెళ్లిముహూర్తం కూడా అయిపోయింది. డిసెంబర్ 6న వీళ్ల పెళ్లి జరగబోతుంది. ఈ పెళ్లితో రామానాయుడు కోరిక కూడా తీరబోతుంది. వధువు కుటుంబానికి పొలాలతో పాటు వ్యాపారాలు కూడా ఉన్నాయని సమాచారం అందుతుంది. రామానాయుడు నివసించిన పాత ఇల్లు డిజైన్ ని కూడా శుభలేఖలపై అచ్చు వేయిస్తున్నారట. నాన్నపై ఉండే గౌరవంతో దగ్గుబాటి సురేష్ ఇలా చేస్తున్నారు అంటూ తెలుస్తుంది. అయితే దీనిపై శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుంది అనేది అభిమానులకు ఇంట్రెస్టింగ్ గా మారింది..!!