టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక మార్కెట్ పరంగా డౌన్ లో ఉన్న విజయ్‌కు ఖుషి సినిమా రూపంలో హిట్టు వచ్చిన దానిని పూర్తిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక మార్కెట్ పరంగా డౌన్ లో ఉన్న విజయ్‌కు ఖుషి సినిమా రూపంలో హిట్టు వచ్చిన దానిని పూర్తిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను పంపిణీ చేసిన అభిషేక్ నామ ఆ సినిమా పంపిణీ చేసి 8 కోట్లు నష్టపోయానని.. దీనిపై ఎవరూ స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా విజయ్‌ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మీరు మీ ఫ్యామిలీలకు చెందిన 100 కుటుంబాలకి కోటి ఇస్తామంటున్నారు.. అలాగే మీ సినిమా కొన్ని నష్టపోయిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం అంటూ సెటరీకల్ గా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో చాలామంది విజయ్ ఆ సినిమా నిర్మాతలు.. సినిమా కొన్న వారిని ఆదుకోలేదా అంటూ కొత్త రచ్చ మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా అభిషేక్ నామ విజయ్ దేవరకొండ డేట్లు ఇప్పించమని అతని తండ్రిని రిక్వెస్ట్ చేస్తే సుకుమార్, త్రివిక్రమ్ తో సినిమాలు సెట్ చేస్తే నా కొడుకు డేట్ ఇస్తాడని అభిషేక్ అన్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై విజయ్ తండ్రి గోవర్ధన్ రావు స్పందించారు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్లాప్ అయినప్పుడు విజయ్ తన రెమ్యూనరేషన్ లో సగం వెనక్కు ఇచ్చేశాడు.. తనకు ఇస్తానన్న ప్లాట్ కూడా వద్దన్నాడు.. ఇంతకంటే ఇంకేం చేస్తాడు అయినా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తే విజయ్ ఏం చేస్తాడు ? అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన విషయం అభిషేక్ చాలా కాలంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాడు.
ఇప్పుడు మా కొడుకు పేరు ప్రస్తావించడం బాధాకరం.. నిజంగా మేము అతడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని చెప్పాడు. విజయ్ ఎప్పటికీ అతడితో సినిమాలు చేయడు.. ఇప్పటికే విజయ్ దిల్ రాజు – మైత్రి మూవీ – గీతా బ్యానర్ లో సినిమాలకు సంతకం చేశాడు.. అతడి డేట్లు ఖాళీగా లేవని విజయ్ తండ్రి గోవర్ధన్ తెలిపాడు.