అదృష్టం హ్యాండ్ బ్యాగ్ లో ఉంటే కొండమీద కోతైన సరే దిగి రావాల్సిందే .. అలాంటి అదృష్టం ఇప్పుడు దక్కించుకొని సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది మహానటి కీర్తి సురేష్ . ఒకప్పటి జనరేషన్ కి మహానటి అంటే సావిత్రి గారు.. ఎలా గుర్తొచ్చేవారో.. ఇప్పటి జనరేషన్ కి మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తు వచ్చి చెప్పే పేరు కీర్తి సురేష్ . కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో నటించిన ప్రాజెక్ట్స్ అన్ని డిజాస్టర్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా భారీ బడ్జెట్లో తెరకెక్కించి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన భోళాశంకర్ సినిమా డిజాస్టర్ అయ్యింది.
పరమ చెత్త కలెక్షన్స్ సాధించి .. ఒకరు కాదు ఇద్దరు కాదు సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి చెత్త పేరు తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ నటనకు అయితే డిజాస్టర్ మార్కులు పడ్డాయి . ఆమె ఏ సినిమాలో చెల్లెలుగా నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు . దీంతో కొంతమంది తెలుగు డైరెక్టర్లు ఆమెకు అవకాశం ఇవ్వాలంటే భయపడిపోతున్నారు . ఇలాంటి క్రమంలోనే ఆ అదృష్టం ఆమె తలుపు తట్టింది.
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఓ బడా ఆఫర్ కీర్తి సురేష్ ఖాతాలో వేసుకునింది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆమె ఎంట్రీ ఇచ్చే సినిమాని స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వబోతుంది . ఆ హీరో మరెవరో కాదు లవర్ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ ధావన్ . వరుణ్ ధావన్ హీరోగా రాబోతున్న నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా మహానటి కీర్తిసురేష్ సెలెక్ట్ అయినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ లవ్ రొమాంటిక్ సినిమా గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు అట్లీ సమర్పిక్కుడుగా వ్యవహరిస్తున్నాడు అంటూ తెలుస్తుంది . త్వరలోనే ఈ మూవీ షూటింగ్లో కీర్తి జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు వైరల్ గా మారింది..!!