Moviesఎన్టీఆర్ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ రీ రిలీజ్‌…. ఆ సూప‌ర్ హిట్ సినిమా...

ఎన్టీఆర్ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ రీ రిలీజ్‌…. ఆ సూప‌ర్ హిట్ సినిమా ఇదే..!

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తి అయిన త‌ర్వాత‌ ఎన్టీఆర్ – ప్రశాంత నీల్‌ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.

ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి తన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిన సింహాద్రి రీ రిలిజ్ చేయగా మళ్లీ సెన్సేషనల్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన మరో ఎవర్‌ గ్రీన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ సినిమానే అదుర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రభినయం చేసిన ఈ సినిమాలో బ్రహ్మానందం – ఎన్టీఆర్ మధ్య వచ్చే కామెడీ సీన్లు ఇప్పటికీ ప్రేక్షకులను ఎలా నవ్విస్తాయో ? తెలిసిందే.

నయనతార – షీలా హీరోయిన్లుగా నటించారు. మెయిన్ గా ఎన్టీఆర్ చారి పాత్రలో అద్భుతమైన కామెడీ పండించారు. వివి. వినాయక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాను నవంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Latest news