Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ ' OG ' స్టోరీ ఇదే… వింటుంటేనే పూన‌కాలు...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘ OG ‘ స్టోరీ ఇదే… వింటుంటేనే పూన‌కాలు లోడింగ్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జరుగుతోంది. సాహో సినిమా తర్వాత యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓజి నుంచి రిలీజ్ అయ్యాక‌ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ నేషనల్ మీడియా వెబ్సైట్లో లీక్ అయింది.

ఓజాస్ గంభీర అనే టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబే కి వస్తాడు. అక్కడ అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో పేదల పక్షాన నిలబడి గ్యాంగ్ స్టార్ గా మారతాడు. క్రైమ్, మాఫియాలలో రారాజుగా ఎదుగుతాడు. అతడని చూసి ఇండియాలో ఉన్న గ్యాంగ్ స్టార్లు, అవినీతి చేసే రాజకీయ నాయకులు.. పేదలను దోచుకునే బడాబాబుల వెన్నులో వణుకు పుడుతుంది.

అక్కడ నుంచి సౌత్ ఏషియాలోని తిరుగులేని గ్యాంగ్ స్టార్ గా ఎదుగుతాడు. ఈ ప్రయాణంలోనే తన కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలో తనకు జరిగిన అన్యాయంపై ఎలా ? ప్రతీకారం తీర్చుకున్నాడు.. విలన్ల సామ్రాజ్యాన్ని ఎలా కుప్ప కూలుస్తాడు అన్నదే ఈ సినిమా స్టోరీ అని సమాచారం. స్టోరీ లైన్ వింటుంటేనే పూన‌కాల మోత మోగిపోతోంది. రేపు థియేట‌ర్ల‌లో ప‌వ‌న్ ఎలా విజృంభిస్తాడా ? అన్న ఆస‌క్తి మామూలుగా లేదు. వ‌చ్చే డిసెంబ‌ర్ లేదా సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news