పేదోడి ఓటిటి ప్లాట్‌ఫామ్ గా చెప్పుకునే ఐ బొమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దవార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఐ బొమ్మలో కొత్త తెలుగు సినిమాలు కూడా పెట్టేస్తున్నారు. అంతకుముందు కొత్త సినిమాలు ఓటిటిల్లోకి వచ్చిన వెంటనే హెచ్డీ క్వాలిటీ ప్రింట్ ను డైరెక్ట్ గా ఐ బొమ్మలో పెట్టేసేవారు. దీంతో చాలామంది ఎలాంటి ప్రీమియం చెల్లింపులు లేకుండా ఉచితంగా కొత్త సినిమాలు చూసేవారు.
ఐ బొమ్మ ఓటిటిలలో వచ్చిన కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి ఫ్రీగా తన వెబ్సైట్లో పెడుతూ ఉండడంతో చాలామంది ఓటిటి ఫ్లాట్ ప్లాట్‌ఫామ్‌ల వైపు వెళ్లేందుకు మొగ్గు చూపటం లేదు. ఇది ఓటిటిలకు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద దెబ్బగా మారింది. అయితే ఇప్పుడు ఏకంగా కొత్త సినిమాలను కూడా తన వెబ్సైట్లో పెట్టేస్తుంది ఐ బొమ్మ. దీంతో కొత్త సినిమాల వసూళ్లపై పెద్ద దెబ్బ పడనుంది.
ఖుషీ, గాండీవధారి అర్జున, జైలర్ సినిమాలు కూడా మంచి క్వాలిటీతో ఐ బొమ్మలో పెట్టడంతో చాలా మంది చూసేశారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఐబొమ్మపై కన్నెర్ర చేసింది. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఐ బొమ్మ పై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఐ బొమ్మ ఏకంగా ఇండస్ట్రీకి.. డిస్ట్రిబ్యూటర్లకు వార్నింగ్ ఇచ్చింది. మీరు ఐ బొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అని చెప్పింది.
డిస్టిబ్యూటర్స్ కి రైట్స్ అమ్మిన తరువాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ఫ్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారని చెప్పింది. ఇక హీరోలకి ఇస్తున్న రెమ్యూనరేషన్లు సినిమా బడ్జెట్లో చాలా ఉంటున్నాయి అని.. సినిమా కోసం కష్టపడుతున్న ప్రొడక్షన్ బాయ్స్… లైట్ బాయ్స్ కు మీరు ఎంత ఇస్తున్నారు ? అంటూ కూడా ఐ బొమ్మ ప్రశ్నించింది. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. అనవసర బడ్జెట్ పెట్టి దానిని ప్రజల మీదకు రుద్ది.. మధ్య తరగతి వాళ్ళ జేబులు గుళ్ల చేస్తున్నారంటూ ఐ బొమ్మ తీవ్రంగా విరుచుకుపడింది. ఇప్పుడు ఐ బొమ్మ పెట్టిన ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.