MoviesTL రివ్యూ: మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి

TL రివ్యూ: మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి

ప‌రిచ‌యం:
దాదాపు 5 సంవత్సరాల గేప్ తర్వాత టాలీవుడ్ స్వీటీ బ్యూటీ అనుష్క నటించిన సినిమా మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి తనకంటే వయసులో చిన్నోడు అయినా నవీన్ పోలిశెట్టికి జంటగా అనుష్క నటించిన ఈ సినిమాను యూవి క్రియేషన్స్ నిర్మించిగా పి మహేష్ దర్శకత్వం వహించారు భారీగా ఎంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో చూద్దాం

క‌థ‌:
అన్విత (అనుష్క) లండన్‌లో ప్రసిద్ధ చెఫ్. ఆమె త‌ల్లి మ‌ర‌ణం త‌ర్వాత ఒంట‌రిత‌నం లేకుండా ఉండేందుకు అన్విత పెళ్లి, శారీరక సంబంధం లేకుండా ఓ బిడ్డను కనాలనుకుంటోంది. ఇందుకోసం ఆమె ఇండియాకు వెళ్లి అక్క‌డ స్టాండప్ కమెడియన్ సిద్ధు (నవీన్ పోలిశెట్టి)తో ప‌రిచ‌యం ఏర్ప‌డ్డాక అత‌డి త‌న వెర్రీ కోరిక చెపుతుంది. షాక్ అయిన సిద్ధు ఏం చేశాడు ? ఆ త‌ర్వాత భిన్న మ‌న‌స్త‌త్వం ఉన్న ఈ ఇద్ద‌రు వ్య‌క్తులు ఏం చేశార‌న్న‌దే ఈ సినిమా స్టోరీ..!

విశ్లేష‌ణ :
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా అన్విత (అనుష్క) మరియు ఆమె తల్లి జయసుధ సెంటిమెంట్ సీన్ల‌తో స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్టింగ్‌లోనే ఈ సీన్లు పెట్ట‌డం కాస్త షాకే. వీటిని ప్లాష్‌బ్యాక్‌లో చూపించొచ్చు. హీరో నవీన్ సీన్లు ప్రారంభ‌మ‌య్యాక ప్రేక్ష‌కుడికి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. కామెడీ సీన్ల కంటే జోకులు బాగా పేలాయి. అన్విత శృంగారం లేకుండా బిడ్డ‌ను కోరుకునే క్ర‌మంలో చెప్పిన క‌థ క‌న్విన్సింగ్‌గా ఉంటుంది. ఫ‌స్టాఫ్ ఓ మోస్త‌రుగా ఎంగేజింగ్‌గానే ముగుస్తుంది.

ఇక సెకండాఫ్‌లో న‌వీన్ మంచి కామెడీ టైమింగ్‌తో సినిమాను 50 నిమిషాల పాటు బాగా ఎంగేజ్ చేస్తాడు. ఆ త‌ర్వాత సినిమా మ‌ళ్లీ ప్లాట్ బోరింగ్ మోడ్లోకి వ‌చ్చేస్తుంది. హీరోకి పిల్ల‌ల తండ్రి హోదా ఇవ్వ‌డంపై అనిత ఎందుకు ? మ‌న‌సు మార్చుకుంద‌న్న దానికి జ‌స్టిఫికేష‌న్ లేదు. న‌వీన్ క్యారెక్ట‌రైజేష‌న్ మాత్ర‌మే సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. రాధ‌న్ పాట‌లు బాగోలేదు. ఆర్ ఆర్ బాగుంది.

ఇక సినిమా ప్ల‌స్‌ల విష‌యానికి వ‌స్తే న‌వీన్ క్యారెక్ట‌రైజేష‌న్‌. నేప‌థ్య సంగీతం… చాలా రోజుల త‌ర్వాత అనుష్క‌ను వెండితెర మీద చూడ‌డం.. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్లు… పూర్ సాంగ్స్‌, వీక్ క్లైమాక్స్‌, యూనివ‌ర్సీల్ అప్పీల్ లేని స్టోరీ.

ఫైన‌ల్‌గా…
మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమా యూత్‌ను కొంత వ‌ర‌కు మెప్పిస్తుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ మరియు పెర్ఫార్మెన్స్‌తో సినిమాను చాలా వ‌ర‌కు లాక్కొచ్చాడు. ఫ‌స్టాఫ్ ఓ మోస్త‌రుగా ఉంటుంది. సెకండాఫ్‌లో హీరో కామెడీ నిల‌బెట్టింది. అయితే వీక్ పాట‌లు, బ‌ల‌హీన‌మైన క్లైమాక్స్ సినిమా రేంజ్ తగ్గించేశాయి. ఓవ‌రాల్‌గా అనుష్క‌తో పాటు న‌వీన్ క్యారెక్ట‌ర్ కోసం ఓ సారి సినిమాను చూడొచ్చు.

ఫైన‌ల్ పంచ్‌: అనుష్క శెట్టి, న‌వీన్ పోలిశెట్టి కోసం ఓ లుక్కేయొచ్చు

మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news