Movies"అలా చేయడం ప్రభాస్ కి రాదు".. అనుష్క ఊహించని సంచలన కామెంట్స్..!!

“అలా చేయడం ప్రభాస్ కి రాదు”.. అనుష్క ఊహించని సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రిలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి తాజాగా నటిస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా మరికొద్ది గంటలోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటించారు. మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోవడానికి రెడీగా ఉంది .

కాగ ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కెవ్వు కేక అనే చెప్పాలి. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క శెట్టి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . అనుష్క శెట్టి ఎప్పుడెప్పుడు దొరుకుతుందా ప్రభాస్ పై ప్రశ్నల వర్షం కురిపిద్దామా..? అని కాచుకొని ఉన్నారు చాలామంది.

రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్కకి ప్రభాస్ పై ప్రశ్నలు ఎదురైయాయి. ఈ క్రమంలోనే అనుష్క స్పందిస్తూ ..”ప్రభాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని ..చాలా చాలా డియరెస్ట్ ఫ్రెండ్ అని చాలా మంచి క్యారెక్టర్ అని ..ఎదుటివారిని హర్ట్ చేయడం ప్రభాస్ కి రాదని.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడని.. బాధ ఉన్న సరే తానే ఆ బాధను అనుభవిస్తాడు తప్పిస్తే తన వల్ల వేరే వాళ్ళు హర్ట్ అవ్వడం ఆయనకు ఇష్టం లేదని .. ఇప్పటివరకు ప్రభాస్ ఎప్పుడు అలా చేయలేదని చెప్పుకు వచ్చింది “. దీంతో ప్రభాస్ ని అనుష్క ఎంత బాగా అర్థం చేసుకుందో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు ఇంత మంచిగా అండర్స్టాండింగ్ ఉన్న మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సలహా ఇస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news