Movies5 ఏళ్ల‌కే ఇంట్లో నుంచి పారిపోయిన స్టార్ హీరోయిన్ అయ్యింది… ఎవ‌రా...

5 ఏళ్ల‌కే ఇంట్లో నుంచి పారిపోయిన స్టార్ హీరోయిన్ అయ్యింది… ఎవ‌రా హీరోయిన్‌…!

ఆమె బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్.. అయితే ఆమె కెరీర్ గురించి తెలిస్తే షాక్ అవుతాం. బాలీవుడ్లో అత్యంత గ్లామర్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె పుట్టి పెరిగింది మన హైదరాబాద్ లోనే కావటం విశేషం. పైగా ఫిమేనా మిస్ ఇండియా టైటిల్ కూడా గెలుచుకుంది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అయితే ఆమె 5 ఏళ్ల వయసులో తండ్రి పై కోపంతో ఇంటి నుంచి పారిపోయిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఆ హీరోయిన్ ఎవరో కాదు దియామీర్జా. 2000 లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న దియా ఆ తర్వాత 2001లో రెహనా హై తెరే దిల్ మే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ద‌స్ – లగే రహో మున్నాభాయ్ – హనీమూన్ – ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సినిమాలలో నటించింది. ఆమె 2019లో కాఫీర్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

కేవలం ప్రతిభ‌ ఆధారంగానే ఆమె హీరోయిన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మిస్ ఆసియా పసిఫిక్ గా నిలిచిన దియామీర్జా తల్లి బెంగాలీ కాగా.. ఆమె తండ్రి జర్మనీ వ్యక్తి. దియా పుట్టిన తర్వాత ఆమె తల్లి భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె తల్లి హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మీర్జాన్ పెళ్లాడింది. దియా ఇప్పటికీ తన స‌వ‌తి తండ్రి పేరుని ఇంటిపేరుగా పరిగణిస్తోంది.

ఇటీవల ఐపా 2023 అవార్డుల సందర్భంగా తన లుక్క్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులోనే తన తండ్రిపై కోపం పెంచుకున్న ఆమె.. తండ్రి తిట్టడంతో ఇంటి నుంచి పారిపోయి బంధువుల వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఒక మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా నెలకు కేవలం 5000 జీతానికి పని చేసింది. అయితే ఆమె నటించిన తొలి సినిమా ఏకంగా రు.100 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ లో అత్యుత్తమ రొమాంటిక్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాలో దియామీర్జా ఒక సాధారణ అమ్మాయి పాత్రలో నటించింది. అయితే దిగ తన వ్యక్తిగత జీవితంలో భర్త సాహిల్ సంఘీతో సంగీతం విడిపోయిన తర్వాత వైభవ్ వాహిల్‌ను రెండో వివాహం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news